Thursday, June 18, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయం1990 నాటి కనిష్ట స్థాయికి చమురు నిల్వలు

1990 నాటి కనిష్ట స్థాయికి చమురు నిల్వలు

- Advertisement -

పారిస్‌ : ప్రపంచంలో చమురు నిల్వలు భారీగా పడిపోయాయని ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఎజెన్సీ (ఐఈఏ) వెల్లడించింది. ఆర్గనైజేషన్‌ ‌ఫర్‌ ఎకనామిక్‌ ‌కోఆపరేషన్‌ అండ్‌ ‌డెవలప్‌‌మెంట్‌ ‌క్లబ్‌ (ఓఈసీడీ) దేశాల్లో గత మే నెల నాటికి ఇవి 1990 తర్వాత అత్యంత కనిష్ట స్థాయికి క్షీణించాయని బుధవారం విడుదల చేసిన తన తాజా నెలవారీ నివేదికలో వెల్లడించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్ ప్రాంతం నుండి చమురు రవాణా నిలిచిపోవడమే దీనికి ప్రధాన కారణమని ఐఈఏ పేర్కొంది. పశ్చిమాసియాలో సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి గల్ఫ్ ముడి చమురు సరఫరాలో ఏర్పడిన అంతరాయాన్ని అధిగమించడానికి ఆయా దేశాల ప్రభుత్వాలు తమ వ్యూహాత్మక నిల్వల చమురును విపరీతంగా మార్కెట్లోకి విడుదల చేశాయి. ఈ సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఒఇసిడి కూటమి దేశాలు తమ నిల్వల నుండి ఏకంగా 163 మిలియన్ బారెల్స్ మేర ముడి చమురును ఉపయోగించుకున్నట్టు ఐఈఏ తన నివేదికలో స్పష్టం చేసింది. సరఫరా కొరత మార్కెట్‌పై ప్రభావం చూపకుండా ఉండేందుకు ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -