Tuesday, February 17, 2026
E-PAPER
Homeకరీంనగర్పదిలో శతశాతం ఫలితాల సాధనకు కృషి చేయాలి: సర్పంచ్

పదిలో శతశాతం ఫలితాల సాధనకు కృషి చేయాలి: సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ-రాయికల్
పదవ తరగతి వార్షిక పరీక్షల్లో శతశాతం ఫలితాలు సాధించి గ్రామానికి,తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తేవాలని గ్రామ ఇటిక్యాల గ్రామ సర్పంచ్ నీరటి శ్రీనివాస్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. మండలంలోని ఇటిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న సాయంకాల ప్రత్యేక తరగతులను సర్పంచ్‌తో పాటు మాజీ ఎంపీపీ,వార్డు సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులతో మాట్లాడి చదువుపై దృష్టి సారించాలని సూచించారు.

నిరంతరం పాఠశాలకు హాజరై క్రమశిక్షణతో చదివితేనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, చదువుతోనే బంగారు భవిష్యత్తు సాధ్యమని అన్నారు. పాఠశాలకు, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల విషయంలో గ్రామ సర్పంచ్‌గా పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించి, పై చదువులు కొనసాగించి ఉన్నత ఉద్యోగాలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కాటిపెల్లి గంగారెడ్డి, వార్డు సభ్యులు కొక్కెర రాజేందర్ యాదవ్,మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యాయ పండిత పరిషత్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షుడు వేల్పుల స్వామి యాదవ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -