పోషకాహార లోపం ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో మోడల్ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు మహిళా, శిశు, దివ్యాంగుల & వయో వృద్దుల శాఖ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో కలెక్టర్ మాట్లాడుతూ ..జిల్లాలో మోడల్ అంగన్వాడి కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అంగన్వాడి కేంద్రాల లో పిల్లల ఎత్తు బరువు పరిశీలించి పోషక లోపం ఉన్న పిల్లల పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. అంగన్వాడి కేంద్రాలో పిల్లల కి ప్రత్యేక నూతన ప్రి స్కూల్ సిలబస్ ప్రకారం బోధించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
అంగన్వాడీ కేంద్రాలు ఓపెన్ చేసి పోషన్ ట్రాకర్ ద్వారా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. వయో వృద్ధుల మెయింటెనెన్స్ కేసులు, సమస్యలు పరిష్కరించాలనీ మహిళాల పట్ల ఎలాంటి ఆకృత్యాలు జరగకుండా చట్టాల పై అవగాహన కల్పించాలని అయన అన్నారు. ఈ సమీక్ష సమావేశం లో జిల్లా శిశు సంరక్షణ ,ఉమెన్ వెల్ఫేర్, వయో వృద్ధుల గురించి చేయవలసిన వివిధ విషయాల పై సమీక్షించారు. అంగన్వాడి కేంద్రాల లో టాయిలెట్, డ్రింకింగ్ వాటర్ , రిపేర్స్ తొందర గా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కే.నరసింహరావు,సూపరిండెంట్, జి.హుస్సేన్, డిసిపివో రవి కుమార్, ఏఫ్.ఆర్.వో బి.వినోద్ కుమార్, సంకల్ప జిల్లా కోఆర్డినేటర్ చైతన్య తదితరులు పాల్గొన్నారు.



