Thursday, June 18, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుతరగతి గదుల్లో రాష్ర్ట భవిష్యత్‌ 


తరగతి గదుల్లో రాష్ర్ట భవిష్యత్‌ 


- Advertisement -

ప్రతి నియోజకవర్గానికీ ఓ పాఠశాల : సీఎం ఎ.రేవంత్‌‌రెడ్డి
రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్‌ ‌స్కూల్‌ ప్రారంభోత్సవం
రాష్ట్రంలోని లక్ష‍లాది మంది విద్యార్థులకు స్ఫూర్తినిస్తుందని వ్యాఖ్య
అడ్మిషన్ల పెంపులో ఉపాధ్యాయుల పాత్ర అమోఘం

ప్రభుత్వ 
బడుల్లో 
చదవడం 
నామోషీ అనే ఆలోచనుండొద్దు

నవతెలంగాణ-
రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ భవిష్యత్ అద్దాల మేడలు, రంగుల గోడల్లో లేదనీ, తరగతి గదుల్లోనే ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపించడంలో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌‌ను ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌‌ను సీఎం ప్రారంభించారు. అంతకుముందు పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన బస్సును సీఎం పరిశీలించారు. మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీలు,ఎమ్మెల్యేలతో కలిసి హెలిప్యాడ్ నుంచి స్కూల్ ప్రాంగణం వరకు ఆయన స్కూల్ బస్సు లోనే ప్రయాణించారు. స్కూల్ ప్రాంగణానికి చేరుకున్న అనంతరం పైలాన్ ఆవిష్కరించి, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీతో మాట్లాడారు. ‘థాంక్యూ సీఎం` అంటూ తనకు స్వాగతం పలికిన విద్యార్థులను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రసంగిం చారు. తెలంగాణ పబ్లిక్‌ ‌స్కూల్‌‌ను విద్యార్థులకు అంకితం చేస్తున్నామని అన్నారు. ఈ స్కూల్ కేవలం ఆరుట్ల గ్రామానికి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి మాత్రమే స్ఫూర్తి కాదని, తెలంగాణలోని 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.

ఈ స్కూల్‌‌లో ఇప్పటికే 1,814 మంది విద్యార్థులు చేరారని, ఒక ప్రభుత్వ పాఠశాలకు నో అడ్మిషన్ బోర్డు పెట్టే పరిస్థితి ఉందంటే విద్యా ప్రమాణాల్లో ప్రభుత్వ చిత్తశుద్ధి ఎలాంటిదో స్పష్టమవుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు కృషి చేస్తున్న ఉపాధ్యాయులను ఈ సందర్భంగా అభినందించారు. ప్రభుత్వ బడుల్లో చదవడం నామోషీ అనే ఆలోచన పోవాలన్నారు. ఈ పాఠశా లల్లో చదువుకున్న వారెందరో గొప్ప నాయకులుగా, అధికారులుగా ఎదిగా రని చెప్పారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ప్రభుత్వ బడిలో చదువుకున్నారని, తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుని సీఎం స్థాయికి చేరుకున్నానని తెలిపారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందన్నారు. విద్యార్థుల మధ్య కుల వివక్షను దూరం చేసేందుకు ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌’ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డిసెంబరు 9న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భవనాన్ని ప్రారంభించ నున్నట్టు ప్రకటించారు. ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని, ఈక్రమంలో విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ అందించే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీని హైదరాబాద్ నగరానికి తీసుకువచ్చి విద్యార్థులతో ఫు‌ట్‌బాల్ ఆడించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, విద్యా కమిషన్ చైర్మెన్ ఆకునూరి మురళి, సభ్యులు, వివిధ కా‌ర్పొరేషన్ల చైర్మెన్లు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులతో కలిసి బ్రేక్‌‌పాస్ట్‌
పాఠశాల ప్రారంభోత్సవంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. కిచెన్‌‌ను పరిశీలించి, ‘నేను మీలా పూరీ చేయగలనా..’ అంటూ ముఖ్యమంత్రి పూరీ చేసి, వంట చేసే మహిళలతో సరదాగా మాట్లాడారు. అనంతరం ప్రీ-ప్రైమరీ తరగతి గదులను సందర్శించి చైల్డ్ లెర్నింగ్ యాక్టివిటీని పరిశీలించారు. పాఠశాలలో లైబ్రరీ, తరగతి గదులు, ఇన్నోవేషన్ ల్యాబ్, ఫిజిక్స్, బాటనీ, కెమిస్ట్రీ ల్యాబ్స్‌ను సందర్శించారు. అలాగే పాఠశాల ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి జామ మొక్కను నాటారు. అనంతరం డ్యాన్స్, మ్యూజిక్ రూమ్‌‌ను సందర్శించి, అక్కడి యాక్టివిటీస్ గురించి అడిగి తెలుసుకున్నారు. అటు నుంచి ఫుట్‌బాల్ గ్రౌండ్‌‌కు వెళ్లి విద్యార్థులతో కాసేపు ఫు‌ట్‌బాల్ ఆడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -