జీ7 ద్వైపాక్షిక చర్చలో ట్రంప్, ప్రధాని మోడీ భేటీ
పారిస్ : మోడీ తనకు మంచి స్నేహితుడనీ, మా ఇద్దరి మధ్య ఒక గొప్ప అనుబంధం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ప్రధాని మోడీతో మంచి చర్చలు జరిగినట్టు తెలిపారు. భారత నావికుల మృతి తీరని నష్టమని , భారత్ నావికులపై దాడి జరిగితే తాము కాపాడతామని చెప్పారు. మోడీ నాయకుడిగా ఉన్నంతకాలం భారత్‌ను కాపాడుతామని ట్రంప్ హామీ ఇచ్చారు. నేవీ భద్రత విషయంలో భారత్‌తో కలిసి పనిచేస్తామన్నారు. భారత్-అమెరికా రక్షణ సంబంధాలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తాము వాణిజ్య ఒప్పందం చేసుకుంటున్నట్టు చెప్పిన ఆయన అమెరికా, భారత్ మధ్య చాలా మంచి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. అమెరికా మునుపెన్నడూ లేనంత అద్భుతంగా రాణిస్తోందని తెలిపారు. ప్రధాని మోడీ అమెరికాలో చాలా ప్రాజెక్టులు చేపడుతున్నారని ట్రంప్ వెల్లడించారు. ఈ సందర్భంగా హార్ముజ్ జలసంధిలో నావికుల భద్రత భారత్‌కు ఎంతో ముఖ్యమని ప్రధాని మోడీ అమెరికాకు స్పష్టం చేశారు. జీ7 సమావేశం సందర్భంగా ఫ్రాన్స్‌లోని ఏవీయన్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పశ్చిమాసియా శాంతికి కృషి చేసిన ట్రంప్‌ను ప్రశంసించారు. ఇటీవల హార్ము జ్‌లో భారత జెండా ఉన్న నౌకపై అమెరికా దాడి చేసిన నేపథ్యంలో ప్రధాని ఆ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. అయితే భారతీయులు ముగ్గురు చనిపోయిన విషయాన్ని సూటిగా చర్చించకపోవటం గమనార్హం. ఈ క్రమంలోనే నావికుల భద్రత తమకు చాలా కీలకమన్నారు. సముద్ర మార్గాల్లో స్వేచ్ఛా నౌకాయానం ఉండేలా చూడాలన్నారు. ప్రపంచంలోని వివిధ సముద్రాలలో లక్షలాది మంది భారతీయ నావికులు విధులు నిర్వర్తిస్తున్నారని మోడీ చెప్పారు. వారి భద్రత కూడా అంతే ముఖ్యమని తాను భావిస్తున్నట్లు ట్రంప్‌నకు తెలిపారు. ఇరాన్‌తో చేసుకోబోయే ఒప్పందంలో నావికుల భద్రతకు భరోసా కల్పిస్తారని విశ్వసిస్తున్నట్టు ట్రంప్‌తో మోడీ అన్నారు.
మోడీ మేరా దోస్త్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



