టెల్ అవీవ్ : గాజాలో దాడులను ఉధృతం చేయాలని, ప్రతి రాత్రి కనీసం 30-40 మందిని హతమార్చాలని ఇజ్రాయిల్ జాతీయ భద్రతా వ్యవహారాల మంత్రి ఇతమార్ బెన్-గ్విర్ పిలుపునిచ్చారు. గాజా బందీ బ్రాస్‌లవ్‌స్కీతో పాడ్‌కాస్ట్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్య చేశారు. గాజాలో దాడులను తగ్గిస్తున్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహూపై ఆయన విమర్శలు సంధించారు. ప్రధాని వైఖరితో తాను ఏకీభవించడం లేదని అంటూ చేయాల్సిన హత్యాకాండపై ప్రచారం నిర్వహించాలని సూచించారు. ‘ఇందులో రహస్యమేమీ లేదు. ప్రధానితో నేను ఏకీభవించడం లేదు. గాజాలో హత్యాకాండపై లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ప్రతి రాత్రీ 30-40 మందిని చంపాలి. తక్షణ ముప్పు కలిగించే వారినే కాదు…ప్రాణాలకు విలువ లేని వారిని కూడా హతమార్చాలి. వారు జీవించకూడదు. వారు కనీసం మనుషులు కూడా కాదు’ అని అక్కసు వెళ్లగక్కారు.
గాజాలో ప్రతి రాత్రీ 30-40 మందిని హతమార్చాలి : ఇజ్రాయిల్ మంత్రి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



