భాగస్వాములకు అమెరికా హెచ్చరిక
వాషింగ్టన్ : కృత్రిమ మేధ (ఏఐ) రేసులో చైనా వైపు ఉంటారా లేక తమ పక్షాన నిలుస్తారా అన్నది తేల్చుకోవాలని భాగస్వామ్య దేశాలకు అమెరికా హెచ్చరికలు జారీ చేయబోతోంది. ఒకవేళ వారు బీజింగ్ వైపు ఉంటే అమెరికా నేతృత్వంలోని ఏఐ కూటమి నుంచి బహిష్కరిస్తామని చెబుతోంది. చైనాతో సాంకేతిక పోరు తీవ్రమైన నేపథ్యంలో ఏఐ నమూనాలు, సెమీకండక్టర్లు, కీలక ఖనిజాల సరఫరాలను సురక్షితం చేసే ఉద్దేశంతో అమెరికా గత సంవత్సరం పాక్స్ సిలికా కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో సుమారు పాతిక దేశాలు చేరాయి. ఈ కార్యక్రమంలో చేరిన కజకిస్తాన్ అటు చైనా కూటమిలోనూ ఉంది.
ఈ పరిణామం అమెరికాను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ ఓ ముసాయిదా లేఖను తయారు చేసింది. జూన్‌లో అమెరికా రూపొందించిన ‘ఏఐ అవకాశాల ప్రకటన’పై సంతకాలు చేసిన 35 దేశాలకు ఈ లేఖలు పంపుతారు. చైనా, అమెరికాలలో ఏదో ఒక పక్షాన్ని ఎంచుకునేలా మిత్ర దేశాలపై ఒత్తిడి తేవడం ద్వారా సైనిక లేదా ఆర్థిక ఆధిపత్యం కోసం ఉపయోగపడే ఆధునిక ఏఐ రూపకల్పనలో బీజింగ్‌తో పోటీ పడి, దానికి వనరుల కొరతను సృష్టించాలని అమెరికా భావిస్తోంది.
ఏఐ రేసులో ఎవరితో ఉంటారో తేల్చుకోండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



