Tuesday, August 18, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమమ్మల్ని వెనక్కి పంపొద్దు

మమ్మల్ని వెనక్కి పంపొద్దు

- Advertisement -

స్పెయిన్‌లో వేలాది మంది వలసదారుల ప్రదర్శన
మాడ్రిడ్‌ :
స్పెయిన్‌లో ఉత్తర ఆఫ్రికా తీరంలోని సెయుటాలో ఇటీవల ప్రవేశించిన వేలాది మంది వలసదారులు ఆదివారం ఓ అర్బన్‌ బీచ్‌లో ప్రదర్శన నిర్వహించారు. తమకు ఆశ్రయం కల్పించాలని, మొరాకోకు తిప్పిపంపవద్దని వారు స్పెయిన్‌ అధికారులను కోరారు. రెండు వారాల క్రితం మొరాకో నుంచి 72 వేల మంది వలసదారులు సరిహద్దును దాటి స్పెయిన్‌ భూభాగమైన సెయుటాకు చేరుకున్నారు. సెయుటా జనాభా కేవలం ఎనభై వేలు మాత్రమే. వలస దారులలో కొందరు స్వచ్ఛందంగా తిరిగి మొరాకో వెళ్లినా ఇప్పటికీ ఐదు వేల నుంచి ఎనిమిది వేల మంది వరకూ సెయుటాలోనే ఉన్నారని అంచనా. నగరంలో మౌలిక సదుపా యాల కొరత అధికం కావడంతో వలసదారులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బీచ్‌లోనూ, నగర శివారు ప్రాంతంలోనూ కాలం గడుపుతూ యూరప్‌లో ప్రవేశించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ‘సముద్రం పక్కనే నిద్రపోతున్నాం.
చలి వేధి స్తోంది. దుర్వాసన వస్తోంది. అనేక ఇబ్బందులు పడుతున్నాం’ అని ఓ వలసదారుడు చెప్పారు. నగరంలో ప్రవేశించకుండా తమను పోలీసులు అడ్డుకుం టున్నారని వాపోయారు. ‘మేము మొరాకో తిరిగి వెళ్లాలని అనుకోవడం లేదు’, ‘మేము కూడా మనుషులమే’ అని రాసి ఉన్న ప్లకార్డులు ధరించి వారంతా ప్రదర్శనలో భాగస్వా ములయ్యారు. తాము అలసిపోయామని, పరిష్కారం కోరుతున్నామని నినాదాలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -