Thursday, June 18, 2026
E-PAPER
Homeజాతీయంహైదరాబాద్‌‌లో రోడ్డుకు ట్రంప్‌ పేరు తగదు

హైదరాబాద్‌‌లో రోడ్డుకు ట్రంప్‌ పేరు తగదు

- Advertisement -

తీవ్రంగా ఖండించిన సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ : హైదరాబాద్‌‌లోని అమెరికా కాన్సులేట్‌కు ఆనుకుని ఉన్న రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‌పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నట్టు వస్తున్న వార్తలను సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ తీవ్రంగా ఖండించారు. ఈ చర్య రాజకీయంగా అనుచితమని, భారతదేశ సామ్రాజ్యవాద వ్యతిరేక వ్యతిరేక వారసత్వానికి విరుద్ధమని పేర్కొన్నారు. వియత్నాంలో అమెరికా యుద్ధం ఉధృతంగా సాగుతున్న సమయంలో, గొప్ప సామ్రాజ్యవాద వ్యతిరేక నాయకుడైన హోచిమిన్ సరాని గౌరవార్థం, భారతదేశం కోల్‌కతాలోని యూఎస్ కాన్సులేట్ వెలుపల ఉన్న హారింగ్టన్ వీధికి ఆయన పేరును పెట్టి, ఒక చారిత్రక నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. ఇప్పుడు, దురాక్రమణదారురాలైన అమెరికా ఇరాన్‌పై యుద్ధం, గాజాలో మారణహోమం, వెనిజులాలో సైనిక జోక్యం, క్యూబాపై నేరపూరితమైన పట్టు బిగించడం వంటి వాటి దారుణచ చర్యల మధ్యలో ఉందని తెలిపారు. ఈ తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి… మానవాళిపై సామ్రాజ్యవాద యుద్ధానికి ప్రస్తుత ప్రతీకగా నిలుస్తున్న, మన కాలపు హిట్లర్ కావాలని ఆకాంక్షించే డొనాల్డ్ ట్రంప్‌ను గౌరవించేందుకు హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ పక్కన ఉన్న రహదారికి పేరు మారుస్తున్నారని పేర్కొన్నారు. ‘కొద్ది రోజుల క్రితమే, యూఎస్ నౌకాదళం నిరాయుధ వాణిజ్య నౌకపై దాడి చేసి ముగ్గురు భారతీయ నావికులను హత్య చేసింది. యుఎస్ ప్రభుత్వం తమ దాడులను కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నప్పటికీ, ఈ దారుణమైన క్షిపణి దాడిపై భారత ప్రభుత్వం సరైనరీతిలో నిరసన తెలపడంలో విఫలమైంది, మోడీ ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. భారతదేశ సార్వభౌమత్వాన్ని, ఆత్మగౌరవాన్ని వదులుకోవడానికి బీజేపీ ఏమాత్రం వెనుకాడటం లేదు. ఇప్పుడు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే భావిస్తున్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ ఈ దారుణ చర్యను గమనించి, దానిని ఉపసంహరించుకునేలా జోక్యం చేసుకుంటుందని భావిస్తున్నాము. మన సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రతిఘటన ఉద్యమ ఆదర్శాలను కొనసాగిస్తున్నామన్న వాదనలు కేవలం మాటలకే పరిమితం కాకూడదు’ అని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి బేబీ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -