అమెరికాకు తేల్చి చెప్పిన దక్షిణ కొరియా
సియోల్‌తో ఉమ్మడి సైనిక విన్యాసాలు తగ్గించాలంటూ పెంటగాన్‌కు ట్రంప్ ఆదేశం
వాషింగ్టన్ : ఇరాన్‌ను అణ్వస్త్ర రహిత దేశంగా మార్చేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలకు సహకరిం చాల్సిందిగా అమెరికా చేసిన అభ్యర్థనను దక్షిణ కొరియా తోసిపుచ్చింది. దీంతో సియోల్‌తో సంయుక్త సైనిక విన్యాసాలను తగ్గించుకోవాలని పెంటగాన్‌ను దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. ఈ విషయాలను ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ఇరాన్ వద్ద అణ్వస్త్రాలు లేకుండా చేయాలన్న తన ప్రయత్నాలకు సహకరిస్తారా అని ఇటీవల దక్షిణ కొరియా అధ్యక్షుడిని అడిగానని, అందుకు ఆయన ‘నో’ చెప్పారని ట్రంప్ ఆ పోస్టులో వివరించారు. దక్షిణ కొరియాతో సంయుక్తంగా చేపట్టే సైనిక విన్యాసాలను పూర్తిగా రద్దు చేసుకునేందుకు ఇప్పుడు సమయం లేనందున ఆ వార్షిక విన్యాసాలను కుదించుకోవాలని రక్షణ కార్యాలయాన్ని ఆదేశించానని తెలిపారు. ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, విన్యాసాలలో పాల్గనడం పట్ల తన అసంతృప్తికి అది ఓ కారణమని ట్రంప్ తన పోస్టులో రాసుకొచ్చారు.
సైనిక విన్యాసాలు చాలా ఖర్చుతో కూడినవని అంటూ అవి ఉత్తర కొరియాకు అనుచితమైన, శతృత్వ భావనను కలిగించే సంకేతాలు పంపుతున్నాయని తెలిపారు. తన అధ్యక్ష పదవీకాలంలో ఉత్తర కొరియా ఎలాంటి బెదిరింపులకు పాల్పడకుండా గౌరవప్రదంగా వ్యవహరిస్తోందని చెప్పారు. దక్షిణ కొరియాతో సంయుక్త సైనిక విన్యాసాల నిర్వహణపై చాలా కాలం క్రితమే నిర్ణయం జరిగినందున వాటిని గణనీయంగా తగ్గించాలని రక్షణ మంత్రి పీట్ హెగ్‌సేథ్‌కు సూచించానని తెలియజేశారు. కాగా ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ సాగిస్తున్న ఘర్షణలు, టెహ్రాన్ అణు కార్యక్రమంపై ఒత్తిడి కోసం భాగస్వాములను సమీకరించేందుకు వాషింగ్టన్ చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా, దక్షిణ కొరియా మధ్య ఉల్చీ ఫ్రీడమ్ షీల్డ్ విన్యాసాలు సోమవారం నుంచి ఈ నెల 27వ తేదీ వరకూ జరగాల్సి ఉంది. ఇందులో 18,000 మందికి పైగా దక్షిణ కొరి యా సైనిక సిబ్బంది పాల్గంటారని అంచనా. డ్రోన్లను ఎలా ఎదుర్కోవాలి, జీపీఎస్ సిగల్స్‌ను ఎలా అడ్డు కోవాలి, సైబర్ దాడులు జరిగితే ఎలా కాపాడుకోవాలి అనే అంశాలపై ప్రదర్శనలు జరుపుతారు.
ఇరాన్‌ను అణ్వస్త్ర రహిత దేశంగా మార్చేందుకు సహకరించం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



