హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ కింద నిషేధిత ఆస్తుల జాబితాను రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్‌లో ఎందుకు అందుబాటులో ఉంచడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ అంశంపై ప్రభుత్వ వైఖరిని తెలుసుకుని వారంలోగా వివరాలు సమర్పించాలని రెవెన్యూ శాఖ ఏజీపీని సోమవారం ఆదేశించింది. నిషేధిత ఆస్తుల వివరాలను ప్రజల ప్రయోజనం కోసం పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విజయ్ గోపాల్ వాదించారు. వ్యవసాయ, నాలా కన్వర్షన్ భూముల వివరాలు కూడా అందుబాటులో ఉంచాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణ ఈనెల 20కి వాయిదా వేసింది.
రాయదుర్గం ప్లాట్ల ఈ–వేలం కేసులో ప్రభుత్వానికి నోటీసు
రంగారెడ్డి జిల్లా రాయదుర్గం పన్మక్తలోని సర్వే నెంబర్ 83/1లోని పీ1, పీ2 ప్లాట్ల ఈ–వేలం ప్రక్రియపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని టీజీఐఐసీ, హెచ్‌ఎండీఏ, ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి, హెచ్‌ఎండీఏ సాంకేతిక కమిటీని సోమవారం ఆదేశించింది. ఈ ప్లాట్లు హెరిటేజ్ ప్రిసింక్ట్, రాక్ ప్రిజరవ్డ్ ప్రాంతంలో ఉన్నాయంటూ పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం సమయం కోరడంతో తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు నేటికి వాయిదా
పార్టీ పిరాయింపులకు పాల్పడిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ న్యాయవాది సోమవారం హైకోర్టులో వాదనలు కొనసాగించారు. అసెంబ్లీలో ఫిరాయింపు ఎమ్మెల్యేల చర్యలకే పరిమితం కారాదనీ, అసెంబ్లీ బయట ఫిరాయింపు ఎమ్మెల్యే చర్యలను కూడా పరిగణనలోకి తీసుకుని తీర్పు చెపాలన్న నిబంధనలను స్పీకర్ అమలు చేయలేదన్నారు. పదో షెడ్యూల్‌లోని 2(1)(ఎ) ప్రకారం సభ్యుడు తన పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నాడా లేదా అన్నదే ప్రధానంగా చూడాలని న్యాయవాది కోరారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు నిరాకరిస్తూ స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మెన్ హోదాలో ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని బీఇర్‌ఎస్ వేసిన పిటిషన్లను చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ సోమవారం విచారించారు. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.
నిషేధిత భూముల వెల్లడిపై వివరణ ఇవ్వండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



