మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులన్నీ 2028 మార్చి వరకు పూర్తి చేస్తామని రాష్ర్ట ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. 3,245 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ పారిశ్రామిక వాడకు రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయెల్ న్యూఢిల్లీ నుంచి నిర్వహించిన నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ వీడియో కాన్ఫరెన్సులో శ్రీధర్ బాబు సచివాలయం నుంచి వర్చువల్ గా పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పరిశ్రమల మంత్రులు ఇందులో పాల్గొన్నారు. జహీరాబాద్ స్మార్ట్ సిటీలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఈ స్మార్ట్ సిటీలో భూమి రూపంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 51 శాతం ఉండగా, కేంద్ర ప్రభుత్వం అభివృధ్ది పనులకు నిధులు అందజేస్తున్నదని గుర్తు చేశారు. ఇప్పటికే స్పెషల్ పర్పస్ వెహికల్ కు అభివృద్ధి ప్రణాళికను అందజేసినట్టు శ్రీధర్ బాబు తెలిపారు. ఇంజనీరింగ్, ప్రొక్యూర్ మెంట్, కన్ స్ట్రక్షన్ (ఈపీసీ) పద్ధతిలో జరుగుతున్న పనులు ముందుగా నిర్ణయించిన సమయానికి పూర్తవుతాయిని శ్రీధర్ బాబు వెల్లడించారు. నీటి సరఫరా పనుల టెండర్ల ప్రక్రియ పూర్తయిందని చెప్పారు.
విద్యుత్తు సరఫరా పనులను కూడా గడువులోగా పూర్తి చేస్తామని వివరించారు. భవ్య పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 100 ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కుల్లో నాలుగింటిని తెలంగాణాకు కేటాయించాలని మంత్రి పీయూష్ గోయెల్ ను కోరారు. వీడియో కాన్ఫరెన్సులో టీజీఐఐసీ ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య, పరిశ్రమల కమిషనర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీతో 2 లక్షల మందికి ఉపాధి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



