Tuesday, February 17, 2026
E-PAPER
Homeజిల్లాలుజనగాం మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం

జనగాం మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం

- Advertisement -

చక్రం తిప్పిన ఎంపీ చామల
నవతెలంగాణ – ఆలేరు రూరల్
 
జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువలు మరోసారి విజయం సాధించాయి అని భువనగిరి ఎంపీ ఛానల్ కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం వాయిదా పడిన జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మంగళవారం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాదు నుండి ప్రత్యేక బస్సు ద్వారా కౌన్సిలర్లను జనగామ మున్సిపాలిటీ వద్దకు తీసుకువచ్చారు. ఎన్నికల అధికారుల సమక్షంలో చైర్ పర్సన్ ఎన్నిక ప్రారంభమై ఉత్కంఠభరిత పోరులో చివరికి కాంగ్రెస్ పార్టీ జనగామ మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకుంది.

జనగామలో మొత్తం 30 కౌన్సిలర్ వార్డులు ఉన్నాయి. 15 కౌన్సిలర్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా మరో 15 బీఆర్ఎస్ గెలుపొందింది. దీనితో ఎంపీ చాముల కిరణ్ కుమార్ రెడ్డి ఎక్స్ అఫీషియ ఓటు జనగామ మున్సిపాలిటీలు వేసేందుకు నమోదు చేసుకున్నారు. మరోవైపు జనగామ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర్ రెడ్డి కూడా జనగామలో వేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో 16 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి 16 ఓట్లు బిఆర్ఎస్ కు ఉండడంతో ఎన్నికల అధికారులు టాస్ ద్వారా ఫలితాన్ని తేల్చారు.

మొత్తం సభ్యుల సంఖ్యలో కాంగ్రెస్ పార్టీకి 16 ఓట్లు.16 ఓట్లు బీఆర్ఎస్ కు ఉండడంతో అధికారులు డ్రా నిర్వహించారు. ఈ డ్రాలో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి కడకంచి బాలమణి పేరు రావడంతో జనగామ చైర్మన్ స్థానం కాంగ్రెస్ పార్టీకి దక్కింది. దీంతో ప్రజాస్వామ్యంపై నమ్మకం మరింత బలపడింది.

ఈ సందర్భంగా ఎంపీ చామల మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం ముందు, ఆ దేవుడి తీర్పు ముందు పల్లా  రాజేశ్వర్ రెడ్డి రౌడీ రాజకీయం, డబ్బు రాజకీయం ఓటమి పాలైంది అన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ మున్సిపల్ అబ్జర్వర్ ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్  బీర్ల ఐలయ్య జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షులు లకావత్ ధన్వంతీ, నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన కౌన్సిలర్లు ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -