Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసిఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసిఆర్ జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ- రాయపోల్
తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుపుతూ పచ్చని మాగానిగా మార్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, నాయకులు రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం మాజీ సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రాయపోల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు, వడ్డేపల్లి గ్రామంలో కేక్ కట్ చేసి కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర చారిత్రాత్మకమని, ప్రజా సంక్షేమం కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు గ్రామీణ స్థాయికి చేరాయని పేర్కొన్నారు. ఆయన ఆలోచనల దిశగా ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ దీర్ఘాయుష్షుతో ప్రజా సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు నరసింహారెడ్డి, స్థానిక సర్పంచ్ మాసంపల్లి రాజు, ఉప సర్పంచ్ రాజు,రాష్ట్ర యువజన విభాగం నాయకులు రాజిరెడ్డి, సీనియర్ నాయకులు రంగారెడ్డి, జీవన్ రెడ్డి, వార్డు సభ్యులు పరశురాములు, నాయకులు నవీన్ గౌడ్, కనకయ్య, అక్బర్, దయాకర్ రెడ్డి, శ్రావణ్, యాదగిరి, శ్రీనివాస్, లింగం, బిక్షపతి, వెంకటేష్, వీరేశం, నాగరాజు గౌడ్, కనకరాజు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -