Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం కప్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిన జట్టుకు అభినందనలు

సీఎం కప్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిన జట్టుకు అభినందనలు

- Advertisement -

– రాయపోల్ ఎంపీడీవో శ్రీనివాస్
నవతెలంగాణ – రాయపోల్ 

సీఎం కప్ క్రీడలు జిల్లా స్థాయిలో, నియోజకవర్గం స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన రాయపోల్ బాలురు బాలికల జట్లను ప్రత్యేకంగా అభినందించడం జరిగిందని ఎంపీడీవో శ్రీనివాస్, ఎంఈఓ రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం రాయపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన బాలురు, బాలికల జట్లను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల సిద్దిపేట డిగ్రీ కాలేజీలో జరిగిన సీఎం కప్ ఖో- ఖో క్రీడా పోటీల్లో మొదటి బహుమతి సాధించిన బాలికలను అభినందిస్తూ,రాష్ట్ర, జాతీయ స్థాయిలో విద్యార్థులు రాణించాలని తెలియజేశారు.

అలాగే దుబ్బాకలో జరిగిన నియోజకవర్గ స్థాయి సీఎం కప్ పోటీలో పాల్గొని ఖో – ఖో మొదటి స్థానం సాధించిన బాలికలను మరియు రెండవ స్థానం సాధించిన బాలుర జట్లను అభినందించారు.అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండటం వల్ల కనీసం నడవలేక పోతున్న రోజుల్లో ఆటల వల్ల ఆరోగ్యం మహాభాగ్యం అవుతుందని తెలిపారు.ఆటల వల్ల మానసికస్థిరత్వం ఆత్మస్థైర్యం పెరుగుతుందని  తెలియజేశారు.జిల్లా స్థాయిలో గెలుపొందిన స్ఫూర్తితోనే రాష్ట్ర స్థాయిలో గెలుపొంది రాయపోల్ మండలానికి మంచి పేరును తీసుకురావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో రాయపోల్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు నరసింహారెడ్డి, ఎంపీఓ శివకుమార్, గ్రామ సర్పంచ్ మాసంపల్లి రాజు, పిడి గోవర్ధన్ రెడ్డి, సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు యు.స్వామి, ఉపాధ్యాయులు నాగరాజు, తులసీదాస్, సిఆర్పి ఎల్లా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -