నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) 72వ జన్మదినాన్ని పురస్కరించుకుని చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అనేక సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతు బంధు,రైతు బీమా, కల్యాణ లక్ష్మి–షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు, 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపర్చాయని తెలిపారు.
పేదలు, రైతులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన పథకాల వల్ల తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ సాధన నుంచి రాష్ట్ర నిర్మాణం వరకు కేసీఆర్ చేసిన కృషి అపూర్వమని, అందుకే ప్రజలు ఆయనను “తెలంగాణ జాతిపిత”గా భావిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) చౌటుప్పల్ పట్టణ అధ్యక్షులు బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి మండల అధ్యక్షులు గిర్కటి నిరంజన్ గౌడ్ పిఎసిఎస్ మాజీ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి మాజీ జెడ్పిటిసి పెద్దిటి బుచ్చిరెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు సుర్వి మల్లేష్ గౌడ్ సర్పంచులు కాకి శ్రీలత సుందర్, సమిరెడ్డి భారతమ్మ జనార్దన్ రెడ్డి నూతన కౌన్సిలర్లు కొయ్యడ శేఖర్ గౌడ్,ఊదరి యాదయ్య,గడ్డం ఇందిర రాజరత్నం తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు కేసీఆర్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు



