- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ దేశ ఉన్నత విద్యా రంగంలో చారిత్రాత్మక ఘనత సాధించింది. దేశంలోనే తొలిసారిగా ఒకేసారి నాలుగు అంతర్జాతీయ ఐఎస్ఓ సర్టిఫికెట్లను అందుకున్న ఏకైక విశ్వవిద్యాలయంగా రికార్డు సృష్టించింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఈ ప్రతిష్ఠాత్మక ధ్రువపత్రాలను నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో వర్సిటీకి అందజేసింది. విద్యాసంస్థల నిర్వహణ, పర్యావరణం, ఇంధనం, ఆహార భద్రత వంటి కీలక రంగాల్లో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు ఈ గుర్తింపు లభించింది. యూనివర్సిటీ సెనేట్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో బీఐఎస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సందీప్ కుమార్ కనోజియా ఈ సర్టిఫికెట్లను వీసీకి అందజేశారు.
- Advertisement -



