– రాష్ట్ర ఐటి మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు : మంథని నియోజకవర్గం భూపాలపల్లి జిల్లాలోని కాటారం, మల్హర్ రావు, మహాదేవపూర్, మహముత్తరం, పలిమేల మండలాల్లో మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం క్రింద నూతన గ్రామ పంచాయతీ బిల్డింగ్ లు, సీసీ రోడ్లు, డ్రైన్లు, ఇతర అభివృద్ది పనులకు గాను రూ. 5 కోట్ల 60 లక్షల నిధులు మంజూరు చేయించినట్లుగా రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు గురువారం ఒక ప్రకటన తెలిపారు. కాటారం మండలానికి రూ.1 కోటి 45 లక్షలు మహాముత్తారం మండలానికి రూ.1కోటి 15 లక్షలు, మహదేవ్ పూర్ మండలానికి రూ.95 లక్షలు పలిమేల మండలానికి 45 లక్షలు, మల్హర్ రావు మండలానికి రూ.1 కోటి మంజూరు కాగా అడ్వాలపల్లి గ్రామానికి రూ.5 లక్షలు, అన్సాన్ పల్లి గ్రామానికి రూ.5 లక్షలు, చిన్నతూండ్ల గ్రామానికి రూ.5 లక్షలు, ఎడ్లపల్లి గ్రామానికి రూ.5 లక్షలు, ఇప్పలపల్లి గ్రామానికి రూ.5 లక్షలు, కొండంపేట గ్రామానికి రూ.5 లక్షలు, కొయ్యూరు గ్రామానికి రూ.10 లక్షలు, మల్లంపల్లి గ్రామానికి రూ.5 లక్షలు, మల్లారం గ్రామానికి రూ.5 లక్షలు, నాచారం గ్రామానికి రూ.5 లక్షలు, పెద్దతూండ్ల గ్రామానికి రూ.10 లక్షలు, గాదంపల్లి గ్రామానికి రూ.5 లక్షలు, రుద్రారం గ్రామానికి రూ.15 లక్షలు, తాడిచెర్ల గ్రామానికి రూ.15 లక్షలు, వల్లెంకుంట గ్రామానికి రూ.5 లక్షలు మజూరైయ్యారు. కాటారం, మహాముత్తారం, మహదేవ్పూర్, మల్హర్ రావు, పలిమెల ఐదు మండలాలకు ఉపాధిహామీ పథకం కింద రూ. 5కోట్ల 60 లక్షల నిధులు మంజూరు చేసిన మంత్రికి ఐదు మండల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, గ్రామపంచాయతీ సర్పంచ్లు, పాలకవర్గం సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రూ.5 కోట్ల 60 లక్షల అభివృద్ధి నిధులు మంజూరు.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



