నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ద్రావిడ మున్నేట్ర గజకం(DMK) పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన బాటపట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎదురుగా ఫ్లకార్డులు చేతబూని విజయ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రాష్ట్రంలో యువతులపై లైంగిక హింస పెరిగిపోతుందని, “ముఖ్యమంత్రి గారూ, నోరు తెరవండి!”, “ముఖ్యమంత్రి గారూ, మా ఆక్రందనలు మీకు వినపడుతున్నాయా?”, ప్లకార్డులను ప్రదర్శించి, నల్ల బ్యాడ్జీలను ధరించి శాసనసభ ప్రాంగణంలో నిరసన చేపట్టారు. #SpeakUpCM,” అని డీఎంకే పేర్కొంది. రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ఈ నిరసనకు నాయకత్వం వహించారు. రాజకీయ ప్రలోభాల ద్వారా ప్రతిపక్షాన్ని అస్థిరపరిచేందుకు టీవీకే ప్రయత్నిస్తోందని శాసనసభ్యులు ఆరోపించారు.



