Wednesday, February 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు..

ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలు అంబరాన్ని అంటాయి. ఇందల్ వాయి మాజీ ఎంపీపీ బాదావత్ రమేష్ నాయక్, బిఅర్ఎస్ మండల అధ్యక్షులు చిలువేరి గంగా దాస్, మాజీ మండల అధ్యక్షులు శక్కరి కోండ క్రిష్ణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం బాజిరెడ్డి గోవర్ధన్ నివాసానికి చేరుకుని మాజీ ఎమ్మెల్యే కు ఘనంగా సత్కరించి సన్మానించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్,బిఅర్ఎస్ రూరల్ కన్వీనర్ పాశం కుమార్, మండల ప్రధాన కార్యదర్శి పులి శ్రీనివాస్, మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రఘునందన్ (రాము),ఉపాధ్యక్షులు బిరిష్ శేట్టి, తిర్మన్ పల్లి మాజీ ఎంపిటిసి చింతల దాస్,మారంపల్లి సుధాకర్, పులి సాగర్, గణేష్ నాయక్, అంబర్ సింగ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -