Wednesday, February 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబాదంమిల్క్‌ కాదు…గంజాయి తండాయ్

బాదంమిల్క్‌ కాదు…గంజాయి తండాయ్

- Advertisement -

నిందితుడి అరెస్ట్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

బాదం మిల్క్‌ పేరుతో గంజాయి చాక్లెట్లు కలిపిన తండాయిని విక్రయిస్తున్న నేరస్తుడిని ఎక్సైజ్‌శాఖ పోలీసులు అరెస్టు చేశారు. సహజంగా డ్రై ఫ్రూట్స్‌తో కూడిన బాదం మిల్క్‌ను రూ.50 విక్రయిస్తారు. కానీ సదరు నిందితుడు రూ.150కి అమ్మడంతో అనుమానం వచ్చి తనిఖీలు చేస్తే అసలు విషయం బయటపడింది. ఎక్సైజ్‌శాఖ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ లీడర్‌ అంజిరెడ్డి కథనం ప్రకారం ఉప్పుగూడ చార్మినార్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలోని చుడిబజార్‌ నుంచి బేగం బజార్‌ మధ్యలో ఉత్తరప్రదేశ్‌ ఆగ్రాకు చెందిన బీ వికాశ్‌శర్మ అనే వ్యక్తి గత కొంత కాలంగా తండాయి అనే పాల ను విక్రయిస్తున్నాడు. వేడి చేసి చల్లార్చిన పాలల్లో ఐస్‌, డ్రైపూట్స్‌ తయారు చేసి, తండాయి పేరుతో రూ.50 ఒక గ్లాస్‌ అమ్మకాలు జరుపుతుంటాడు.

అయితే అదే తండాయిలో గంజాయి చాక్లెట్లను మిక్స్‌ చేసి రూ.150 అమ్ముతున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన ఎక్సైజ్‌ ఎస్టీఎఫ్‌ ఏ టీమ్‌ లీడర్‌ అంజిరెడ్డి సిబ్బందితో కలిసి వికాస్‌శర్మ ఇంటిపై దాడి చేసి, తనిఖీలు నిర్వహించారు. అతని ఇంట్లో 9.60 కేజీల గంజాయిని మిక్స్‌ చేసిన 1920 చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కొక్క గంజాయి చాక్లెట్‌లో 5 గ్రాముల గంజాయి మిక్సింగ్‌ చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. ఈ చాక్లెట్లను ఆగ్రా నుంచి తెప్పించారు. ఈ చాక్లెట్ల గిరాకి ఎక్కువగా హోలీ సందర్భంగా అధికంగా ఉంటుందని నిందితుడు తెలిపాడు. ఎస్టీఎఫ్‌ పోలీసులు నిందితుడిని, బైక్‌ను, గంజాయి చాక్లెట్లను తదుపరి విచారణ నిమిత్తం చార్మినార్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌లో అప్పగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -