– సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
– ఇబ్రహీంపట్నంలో ఉత్తేజభరితంగా కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం
మహిళా రిజర్వేషన్ల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని, వారి హక్కుల పట్ల మొసలి కన్నీరు కారుస్తోందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని అంబేద్కర్ చౌరస్తాలో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ‘కులరహిత సమానత్వం’పై ఆటపాట, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినా, దానిని అమలు చేయాల్సిన బాధ్యతను విస్మరించి డీలిమిటేషన్ పేరుతో కేంద్రం కొర్రీలు పెడుతోందని మండిపడ్డారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, ఇప్పుడు 2027 తర్వాతే సాధ్యమని చెప్పడం మహిళలను మోసం చేయడమేనన్నారు. మణిపూర్‌లో మహిళలు హింసకు గురవుతుంటే పరామర్శించని ప్రధాని మోడీ, ఎన్నికల వేళ మహిళా హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు సామెల్, కార్యదర్శి ప్రకాష్ కరత్, మాజీ జెడ్పీటీసీ పి. యాదయ్య, ఐలు నాయకులు అరుణ్ కుమార్, అంబేద్కర్ సంఘం నేత హనుమండ్ల కిష్టయ్య, కొండూరు రఘుపతి, వ్యకాస, సీఐటీయూ నాయకులు, ప్రజానాట్యమండలి, ఇతర కళాకారులు పాల్గొన్నారు.
మహిళా రిజర్వేషన్లపై కేంద్రం మొసలి కన్నీరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



