తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా తృతీయ మహాసభలో పోతినేని సుదర్శన్‌రావు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రైతాంగ పోరాటాల ఫలితమే దున్నేవానికి భూమని, వెట్టిచాకిరీ రద్దు కోసం పోరాటాలు నిర్వహించింది రైతుసంఘాలేనని తెలంగాణ రైతుసంఘం (ఏఐకేఎస్) రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. 23వ తేదీ నుంచి మూడు రోజులు కొత్తగూడెంలో నిర్వహించే ఏఐకేఎస్ తెలంగాణ రైతు సంఘం మూడో రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తల్లాడ మండల కేంద్రంలోని సామినేని రామారావు నగర్, కాసాని ఐలయ్య ప్రాంగణం (వాసవి కళ్యాణ మండపం)లో సోమవారం నిర్వహించిన సంఘం ఖమ్మం జిల్లా తృతీయ మహాసభలో పోతినేని ప్రారంభ ఉపన్యాసం చేశారు.
నూతన విత్తన చట్టం విదేశీ విత్తనాలకు అనుకూలంగా ఉందన్నారు. ఎకరానికి 26 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామనే నిబంధన ఎత్తివేయాలన్నారు. పట్టేదారు సంతకం ఉంటేనే కొనుగోలు చేస్తామనే నిబంధన కూడా సరికాదన్నారు. కొందరు పట్టేదారులు విదేశాల్లో ఉంటున్నారని తెలిపారు. భారత వ్యవసాయాన్ని విచ్ఛిన్నం చేసే చర్యలను ఖండించాలని, రైతాంగం, ప్రజాపోరాటాలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు.
అధ్యక్ష కార్యదర్శులుగా
మాదినేని రమేశ్, బొంతు రాంబాబు
తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షునిగా మాదినేని రమేష్, కార్యదర్శిగా బొంతు రాంబాబు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల పరిస్థితి రోజురోజుకు దిగజారి పోతుందన్నారు. గ్రామ గ్రామాన రైతు సంఘాలు బలోపేతం కావాలన్నారు. ఆందోళన చేస్తేనే ప్రభుత్వాలు దిగివస్తాయన్నారు.
సూర్యాపేట జిల్లా నూతన కమిటీ ఎన్నిక
సూర్యాపేట : తెలంగాణ రైతుసంఘం సూర్యాపేట జిల్లా నూతన కమిటీ 16 మంది ఆఫీస్ బేరర్స్, 27 మందితో జిల్లా కమిటీ ఎన్నికైంది. జిల్లా అధ్యక్షులుగా మల్లు నాగార్జున రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా కందాల శంకర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా పారేపల్లి శేఖర్ రావు, కొలిశెట్టి యాదగిరిరావు, పల్లె వెంకట్ రెడ్డి, దేవరం వెంకటరెడ్డి, షేక్ సైదా, దేవి రెడ్డి స్టాలిన్ రెడ్డి జిల్లా సహాయ కార్యదర్శిగా దండ వెంకటరెడ్డి, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, మందడి రామ్‌రెడ్డి, పల్లా సుదర్శన్, గుమ్మడవెల్లి ఉప్పలయ్య, బెల్లంకొండ సత్యనారాయణ, కోశాధికారిగా కొప్పుల రజితలు ఎన్నికయ్యారు. రైతాంగానికి మద్దతు ధర కోసం అలుపెరుగని ప్రజా ఉద్యమాలను నిర్వహిస్తామన్నారు.
పోరాటాల ఫలితమే దున్నేవానికి భూమి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


