- Advertisement -
రంజాన్ మాసం సందర్భంగా సర్కార్ ఉత్తర్వులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రంజాన్ మాసం పురస్కరించుకుని ముస్లిం ఉద్యోగులు తాము పని చేస్తున్న కార్యాలయాల నుంచి గంట ముందు ఇంటికి వెళ్లడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు ఈ వెసులుబాటు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న రెగ్యులర్, ఒప్పంద, పొరుగు సేవల ముస్లిం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వర్తిస్తుందని తెలిపింది.
- Advertisement -



