నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని హాస కొత్తూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు సిఎం కప్ రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణ శ్రీ తెలిపారు. ఇటీవల నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన సీఎం కప్ హ్యాండ్ బాల్ జిల్లా స్థాయి టోర్నమెంట్ లో మంచి ప్రతిభ కనబర్చిన తొమ్మిదవ తరగతి విద్యార్థులు ప్రతిభ, రోషిణి, మహిపాల్ లను సెలెక్టర్ లు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారాని తెలిపారు. ఈ నెల 20 నుండి హైదరాబాద్ లో నాలుగు రోజుల పాటు జరిగే హ్యాండ్ బాల్ పోటీలలో ముగ్గురు విద్యార్థులు ప్రతిభ, రోషిణి, మహిపాల్ పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రస్థాయి హ్యాండ్బల్ పోటీలకు ఎంపికైన విద్యార్థులను సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు అభినందించారు.
పాఠశాలలో క్రీడలను ప్రోత్సహిస్తున్న గ్రామ సర్పంచ్ నలిమెల రేవతి గంగాధర్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణ శ్రీ, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు బుధవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల నుండి రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులు ప్రతిభ, రోషిణి, మహిపాల్ తో పాటు వారికి శీక్షణ ఇచ్చిన పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మాధురి లను ప్రధానోపాధ్యాయురాలు అరుణ శ్రీ, ఉపాధ్యాయులు అభినందించారు.



