నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని కోన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిలు డి. నిఖిత, బి.వెన్నెల సీఎం కప్ రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.మధుపాల్ తెలిపారు. ఈనెల 17న నిజామాబాద్ జిల్లాలలోని తిర్నన్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన సీఎం కప్ నెట్ బాల్ క్రీడ టోర్నమెంట్, జిల్లా సెలక్షన్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పాఠశాల విద్యార్థినిలు డి. నిఖిత, బి.వెన్నెల రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు ఆయన తెలిపారు.ఈనెల 19వ తేదీ నుంచి 23తేది వరకు మహబూబ్ నగర్ జిల్లాలో జరిగే సీఎం కప్ రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీలో విద్యార్థినిలు డి. నిఖిత, బి.వెన్నెల పాల్గొంటారని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ బి.రమేష్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ బెజ్జారపు రాజేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుపాల్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మెల్ల గంగాధర్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు ఉపాధ్యాయుల బృందం అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీలలో మంచి ప్రతిభను ప్రదర్శించి పాఠశాలకు, గ్రామానికి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.
రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీలకు కోన సముంధర్ విద్యార్థినిలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



