Friday, June 19, 2026
E-PAPER
Homeఆటలుఫిఫా ప్రపంచకప్‌లో జర్మనీ జట్టుకు పాముల బెడద

ఫిఫా ప్రపంచకప్‌లో జర్మనీ జట్టుకు పాముల బెడద

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రతిష్టాత్మక ఫిఫా ప్రపంచకప్‌లో పాల్గొంటున్న జర్మనీ జట్టుకు నార్త్‌ కరోలినా క్యాంప్‌లో పాముల బెడద తీవ్రంగా ఉందని జట్టు సభ్యులు వాపోతున్నారు. తదుపరి మ్యాచ్‌ వ్యూహాలతో పాటు పాముల నుంచి ఎలా రక్షించుకోవాలనే అంశాన్ని కూడా ఆలోచించాల్సి వస్తోందని జర్మనీ కెప్టెన్‌ జోషువా కిమ్మిచ్‌ వెల్లడించారు. గడ్డిలో ఏం ఉన్నాయో అని భయపడాల్సి వస్తోందని, జట్టు సభ్యులకు పలు చోట్ల పాములు దర్శనమిస్తున్నాయని, వాటితో ప్రాణహాని లేకపోయినా పాముకాటుకు గురవ్వాలని ఎవరూ కోరుకోరని కిమ్మిచ్‌ పేర్కొన్నారు. స్విట్జర్లాండ్, నార్వే జట్లు కూడా ఇలాంటి సమస్యతోనే ఇబ్బంది పడుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -