జిల్లా లేబర్ శాఖ అధికారి రాజ్ కుమార్
నవతెలంగాణ – అచ్చంపేట
అడ్డా కూలీలు, భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతినియోగం చేసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా లేబర్ శాఖ అధికారి రాజ్ కుమార్ అన్నారు. బుధవారం పట్టణంలోని టీఎన్జీవో భవనంలో కార్మికుల సంక్షేమ పథకాలపై అడ్డ కూలీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. భవన నిర్మాణ అడ్డ కూలీలకు లేబర్ కార్డ్స్, ఇస్రం కార్డు లకు ఆన్లైన్ మీసేవ ద్వారా అప్లై చేసుకోలాన్నారు. లేబర్ కార్డు కలిగిన కార్మికులకు ప్రభుత్వం నుండి రెండు కాన్పుల వరకు రూ.30 వేల ఆర్థిక సాయం అందిస్తుందని, కార్మికులు ప్రమాదవశత్తు మరణిస్తే రూ.10 లక్షల పరిహారం ప్రభుత్వం ఇస్తుందన్నారు.
ఇస్రం కార్డు ద్వారా రెండు లక్షల ఆర్థిక సహాయం ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. అందుకనే లేబర్ అడ్డా కూలీలు, భవన నిర్మాణ కూలీలు వెంటనే లేబర్ కార్డు ఇస్త్రం కార్డుకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుని కార్డు పొందుతే ఈ బెనిఫిట్స్ అన్ని కూడా కుటుంబానికి అందుతుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎం శంకర్ నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు మల్లేష్, సీనియర్ నాయకులు శివకుమార్ భవన నిర్మాణ కార్మిక అడ్డకూలీల సంఘం అధ్యక్ష కార్యదర్శులు రాము, వెంకటయ్య, లక్ష్మణ్, కృష్ణ, తారా సింగ్చం, భవన నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.



