నవతెలంగాణ – జన్నారం
మూడు నుంచి ఐదు సంవత్సరాల లోపు చిన్నపిల్లలను తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకే పంపించాలని మండలంలోని చింతగూడ గ్రామ సర్పంచి సుతారి సుమలత వినయ్ కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని బుధవారం చింతగూడ గ్రామపంచాయతీ పరిది లోని అంగన్వాడీ 1 లో ప్రభుత్వం నుండి వచ్చిన యూనిఫామ్ లు పంపిణీ చేశారు.. అంగన్వాడి కేంద్ర నిర్వహణ, గురించి తెలుసుకున్నారు. అనంతరం రిజిస్టార్లను పరిశీలించారు. ఆ అంగన్వాడి కేంద్ర పరిధిలో ఉన్న గర్భిణీ స లకు బాలింతలకు కోడిగుడ్లు పంపిణి చేశారు. అనంతరం తాటి శ్రీమత్ పటేల్ కు అక్షరాబ్యాసం, కస్తూరి వేదానిషి కి అన్న ప్రాసన చేశారు. గర్భిణీలు బాలింతలు చిన్నారులు అంగన్వాడి కేంద్రాల్లో ఇచ్చే ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ తాటి అనిత, ఏఎన్ఎం భూక్యా రాజేశ్వరి, ఆశ కార్యకర్త కందుల స్వరూప తదితరులు పాల్గొన్నారు.
చిన్నపిల్లలను అంగన్వాడి కేంద్రాలకు పంపించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



