Wednesday, February 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముస్లింలకు అన్ని వసతులు కల్పించాలి

ముస్లింలకు అన్ని వసతులు కల్పించాలి

- Advertisement -

అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

పవిత్ర రంజాన్ మాసం ప్ర్రారంభమవుతున్నందున జిల్లాలోని మసీదులు, వద్ద అన్ని మౌలిక వసతులు కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం మినీ మీటింగ్ హాలులో రంజాన్ మాసం పురస్కరించుకొని శాంతి సంఘ సమావేశం జిల్లా అదనపు కలెక్టరు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..  పవిత్ర రంజాన్ మాసం ఏర్పాట్ల పై సంబంధిత శాఖలకు కేటాయించిన విధులను సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. నమాజ్ వేళ లో   కరెంటు ఉండేలా  చూడాలన్నారు.రంజాన్ మాసం లో కరెంట్, మంచినీరు వంటి సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

మసీదుల వద్ద పఠిష్టమైన పారిశద్య పనులు  చేపట్టాలని, మంచినీరు సౌకర్యం కల్పించాలని, వీధి దీపాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, ముఖ్యంగా ప్రార్ధనా సమయాలలో విద్యుత్ ప్రసారం ఉండేలా చూడాలని ఆదేశించారు. మున్సిపాలిటీ వార్డులలో మంచినీరు  సమయానికి వచ్చే లా చూడాలన్నారు. మంచి నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సోదరభావంతో ప్రశాంత వాతావరణంలో జరుపుకునే రంజాన్ మాసం  అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. మతసామరస్యానికి ప్రతీక గా జిల్లాను నిలపాలన్నారు.

అడిషనల్ ఎస్పీ లక్ష్మి నారాయణ మాట్లాడుతూ..పవిత్ర రంజాన్ మాసంలో మసీదుల వద్ద అన్ని ఏర్పాటు లు చేస్తామని, రంజాన్ మాసంలో పూర్తి బందోబస్తు ఉంటుందని, సెక్యూరిటీని ఏర్పాట్లు చేస్తామని, అందరి సహకారంతో సామరస్య వాతావరణంలో రంజాన్ మాసం నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి జయమ్మ,భువనగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణా రెడ్డి , పోలీస్ అధికారులు,మత పెద్దలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -