నవతెలంగాణ – ఆలేరు టౌన్
ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని గెలిచిన తర్వాత తుంగలో తొక్కే నాయకులు ఉంటారు. మున్సిపల్ ఎన్నికలలో ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం ఆలేరు పట్టణంలో బుధవారం మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటి పని చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్
ఆలేరు పట్టణ కేంద్రంలో మార్కండేయ గుడి దగ్గరలో కంపచెట్లు ,పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగి, చెత్తాచెదారం ఉండడం వలన పాములు తేళ్లు విషపురుగులు సమీపంలో ఉన్న ఇండ్లలోకి వస్తున్నాయి.
అది గమనించి ఎన్నికల ముందే గెలవగానే మొదటి పని సొంత నిధులతో జెసిబి ని తీసుకొచ్చి పిచ్చి మొక్కలను ముండ్ల కంపలను తొలగించి పనులకు శ్రీకారం చుట్టారు
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈరోజు స్టార్ట్ అయిన అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని స్థానిక ప్రజలకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాలనీవాసులు చింతకింది సిద్దులు,రేగోటి వెంకటేష్, బేతి వెంకటేష్, చింతకింది గిరి, ఎలగందుల యాదగిరి,భేతి సత్యనారాయణ, బేతి నాగరాజు , కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం కంప చెట్లు పిచ్చి మొక్కల తొలగింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



