Saturday, June 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమధ్య తరగతి అమ్మాయిచుట్టూ తిరిగే 'గాసిప్`

మధ్య తరగతి అమ్మాయిచుట్టూ తిరిగే ‘గాసిప్`

- Advertisement -

రాశి సింగ్ ప్రధాన పాత్రలో వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై యతి నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘గాసిప్ . నేటి తరానికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్, అందమైన ప్రేమ కథతో సోషల్ సెటైర్ గా డైరెక్టర్ వైభవ్ కౌండిన్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘సిప్పు సిప్పుసాంగ్ ప్రోమోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మేకర్స్ మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేస్తూ ఈ సినిమా నుంచి 'సిప్పు సిప్పు ఫుల్ లిరికల్ పాటని ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు. శక్తి కాంత్ కార్తీక్ స్వరపరిచిన ఈ ఎనర్జిటిక్ పబ్ డాన్స్ ట్రాక్‌కు కాసర్ల శ్యామ్ అందమైన సాహిత్యాన్ని అందించగా, సింగర్ మాళవిక వోకల్స్ పాటను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. ఈ సినిమా ఒక మిడిల్ క్లాసు అమ్మాయి చుట్టూ తిరిగే కథతో యూత్ కు మాత్రమే కాకుండా కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా రూపొందిస్తున్నారు. ఈ పాట చాలా ఫ్రెష్ గా ఉండడంతో ప్రేక్షకులను ఆకట్టు కుంటోంది. సునీల్ సున్నపు మాస్టర్, ఫల్గుణి బంగెర కొరియోగ్రఫీ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాట సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేసింది అని మేకర్స్ తెలిపారు. రాశి సింగ్, రవివర్మ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి రచయిత – వైభవ్ కౌండిన్య, నిర్మాత – ఏతి రేమెళ్ల, సంగీత దర్శకుడు – శక్తికాంత్ కార్తీక్, డిఓపి- సతీష్, ఎడిటర్ – జై కుమార్, సహ నిర్మాత – నరసింహం తెలనాకుల, మ్యూజిక్ లేబుల్: ఆదిత్య మ్యూజిక్.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -