నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభకు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం సిద్ధమైంది. వివిధ రాష్ర్టాల నుంచి ప్రతినిధులు తరలిస్తున్నారు. 4వ రాష్ట్ర మహాసభలకు విచ్చేసిన కర్ణాటక వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పుట్ట మధుకు ఆహ్వాన బృందం స్వాగతం పలికింది. మొదటి రోజు శనివారం బహిరంగ సభ, 21, 22వ తేదీల్లో ప్రతినిధుల సభ జరగనుంది. మాజీ సీఎం మాణిక్‌సర్కార్ ఫొటోతోపాటు ప్రజా సంఘాల నాయకుల ఫొటోలు ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే తమ్మినేని వీరభద్రం, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్ష కార్యదర్శులు ఎ.విజయరాఘవన్ బి.వెంకట్, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ, ఎంపీ శివదాసన్, ఏఐకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగయ్య, ఆర్.వెంకట్రాములుతో కూడిన పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్లతో జిల్లా ఎరుపెక్కింది. సంఘం జెండాలు, తోరణాలను పట్టణం అంతా అలంకరించారు.
కర్ణాటక వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పుట్ట మధుకు స్వాగతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



