Friday, July 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యోగా శిక్షణ తరగతులపై అవగాహన

యోగా శిక్షణ తరగతులపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండల కేంద్రంలో ఆయుష్ ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ తరగతులపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా యోగ శిక్షకుడు మాట్లాడుతూ.. యోగా వలన పలు ఆరోగ్య సమస్యలు దూరం కావడమే కాక, హెల్త్ కండిషన్ బాగుంటుందని అన్నారు. నిత్యం ఉదయం సాయంత్రం రెండు పూటలు యోగా కార్యక్రమం నిర్వహించాలని, ప్రతి ఒక్కరికి వీటిపై శిక్షణ ఇచ్చి నిత్యం తమ ఇంటి వద్ద శిక్షణలో చెప్పిన విధంగా యోగా చేయాలని గ్రామస్తులకు సూచించారు. యోగాతో పలు రోగాలు కూడా నయమవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆయుష్షు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -