- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఫ్రీ బస్సుకు సంబంధించి ప్రతి మహిళకు ‘మహాలక్ష్మి’ స్మార్ట్ కార్డులను ఇచ్చేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. ఈ చిప్ బేస్డ్ కార్డులను టికెట్ మెషీన్‌పై ట్యాప్ చేస్తే టికెట్ జనరేట్ అవుతుందని అధికారులు తెలిపారు. వచ్చే నెల నుంచి వీటిని జారీ చేయనున్నట్లు సమాచారం. పైలట్ ప్రాజెక్టుగా పలు మండలాల్లో కార్డులు జారీ చేసి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారని తెలుస్తోంది.
- Advertisement -



