నవతెలంగాణ-హైదరాబాద్ : భారతదేశానికి యువతే బలం, బలగమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇవాళ ఢిల్లీలోని భారత్ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026ను ఆయన ప్రారంభించారు. ఈ సమ్మిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్, వివిధ దేశాల ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, 500లకు పైగా టెక్ దిగ్గజ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సమ్మిట్ అని తెలిపారు. ప్రపంచంలో ఆరో వంతుకు భారత్ ప్రాతినిధ్యం వహిస్తోందని కామెంట్ చేశారు. ఏఐకి కేంద్రంగా ఇండియా రూపాంతరం చెందుతోందని అన్నారు. స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీకి భారత్ కేంద్రంగా ఉందన్నారు. మానవుల సామర్థ్యాన్ని ఏఐ మరింత పెంచుతోందని తెలిపారు. భవిష్యత్తులో ఏఐ ఏం చేస్తోందనేది కాదని.. ఇప్పుడు ఏఐతో మనం ఏం చేస్తున్నామనేది ముఖ్యమని పేర్కొన్నారు.
భారతదేశానికి యువతే బలం: ప్రధాని మోడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



