Thursday, February 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ- ఆత్మకూరు 
మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో గురువారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మండల కేంద్రంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎరుకొండ రవీందర్ అధ్వర్యంలో శివాజీ మహారాజ్ విగ్రహానికి ప్రజాప్రతినిధులు, యువకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే పెద్దపూర్ గ్రామ అరే కులస్తులు తమ ఆరాధ్య దైవం అయిన శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు . ఈ ఉత్సవాల్లో స్థానిక సీఐ సంతోష్ పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

కటాక్ష పూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను ఆరెకులస్తులు ఘనంగా నిర్వహించారు. శివాజీ విగ్రహానికిపూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి, మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన మరాఠా వీరుడుగా పేరుగాంచారన్నారు. స్త్రీలను గౌరవించి హిందూ ధర్మానికి వన్నెతెచ్చిన ధీరుడని కొనియాడారు.

యువత శివాజీ ఆశయాలను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి మహెశ్వరి రాజు, కటాక్ష పూర్ సర్పంచ్ షబానాగఫూర్, పెద్ద పూర్ సర్పంచ్ ఎలుకటి రవి, మాజీ జెడ్పీటీసీ కే.రాజు, న్యాయవాది టి. సత్యనారాయణ,ఎన్. హరిష్ రావు, శివప్రసాద్, శంకర్ జి, బుర కిషోర్, వార్డు సభ్యులు రాజు ,సతీష్, తిప్పారపు కిషన్ రావు,సురవు యువరాజు,కుడుతల రమేష్, ఇరువల యుగేందర్,లింగదారి రమేష్, సావూరి సుధాకర్, బాసిడి ఆగయ్య, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -