- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా- ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరినా గాని లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు జరపడంపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేసింది. మరోవైపు, స్విట్జర్లాండ్‌కు తమ దౌత్య బృందాన్ని పంపుతున్నట్లు ప్రకటిస్తూనే అమెరికా తన హామీలను నెరవేర్చే వరకు చర్చల్లో ఎలాంటి పురోగతి ఉండబోదని తేల్చి చెప్పింది.
- Advertisement -



