Monday, June 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలు4కె లో 'ఒక్కడు` రీ-రిలీజ్

4కె లో ‘ఒక్కడు` రీ-రిలీజ్

- Advertisement -

సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన చిత్రం ‘ఒక్కడు’. ఎం.ఎస్‌.రాజు నిర్మాత. సుమారు 23 సంవత్సరాల తర్వాత ఆంధ్ర, తెలంగాణతో పాటు భారతదేశవ్యాప్తంగా 4కెలో ఈ సినిమా తెలుగులో విడుదలవుతుంది. రాధా మాధవి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ సమర్పణలో రామకృష్ణ ఈనెల 26న సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. గుణ శేఖర్, మహేష్ బాబు కెరీర్‌లో ఒక మైల్‌ స్టోన్‌గా నిలిచిన ఈ చిత్రం ప్రేక్షకులందరికీ మరోసారి అలరించేందుకు రానుంది. భూమిక చావ్లా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో తనదైన ముద్ర వేశారు. ముఖేష్ రిషి, తెలంగాణ శకుంతల, అజయ్, గీత, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రాజన్, అచ్యుత్ తదితరులు కీలకపాత్రలను పోషించారు. ఈ సందర్భంగా దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ,’ప్రతి సంవత్సరం మరింత క్రేజ్ పెంచుకుంటూ ఇప్పటికే ఎన్నోసార్లు రీ రిలీజ్ అయినప్పటికీ మరోసారి రీ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ నెల 26వ తేదీన సినిమా 4కెలో విడుదల కానుంది. అందరిలాగా నేను కూడా ఈ సినిమాను చూసేందుకు చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -