Monday, June 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలుత్రీడీలో'హనుమాన్`

త్రీడీలో’హనుమాన్`

- Advertisement -

హీరో తేజ సజ్జ సెన్సేషనల్ బ్లాక్‌ బస్టర్ ‘హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రైమ్‌ షో ఎంటర్‌ టైన్‌మెంట్స్ పై కె.నిరం జన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా 2024లో విడుదలై, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో పాన్ ఇండియా ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఈనెల 25న త్రీడీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ త్రీడీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ,'మా నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి చాలా ప్యాషనేట్‌గా తెలుగు ప్రేక్షకులకు కొత్త టెక్నాలజీతో మంచి సినిమా చూపించాలని భావించి హనుమాన్ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు హనుమాన్ త్రీడీ రూపంలో వస్తోంది. దయచేసి మీరందరూ ఈనెల 25న థియేటర్లకు వచ్చి సినిమా చూడండి. ఈ సినిమాలో చివరి 20 నిమిషాలు నాకు మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంటుంది. హను మంతుడు నా బెస్ట్ ఫ్రెండ్. ఆయ నను మళ్లీ ప్రత్యక్షంగా చూసిన ఫీలింగ్ ఈ సినిమా ఇస్తుంది అని తెలిపారు.
‘నేను కూడా మీతో పాటు ఇప్పుడే మొదటిసారి ఈ త్రీడీ ట్రైలర్‌ను చూశాను. నిరంజన్ , చైతన్య ఎంతో కష్టపడి దీనిని సిద్ధం చేశారు. ఇప్పటి వరకు వారు పడిన శ్రమ ఎంత గొప్పదో ఇప్పుడు అర్థమైంది. త్రీడీ చాలా అద్భుతంగా వచ్చింది. ఇది అందరినీ ఎంతగానో అలరి స్తుందని ఆశిస్తున్నాను. నేనూ మీలాగే మళ్లీ థియేటర్లలో ఈ సినిమాను త్రీడీలో చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తు న్నానుఅని హీరో తేజ సజ్జ చెప్పారు. నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ,'మీరు హనుమాన్ సినిమాను 2డీలో ఎంతగా ఆస్వా దించారో, త్రీడీలో కూడా అంతే అద్భుతంగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను అని తెలిపారు.
నిర్మాత చైతన్య రెడ్డి మాట్లాడుతూ,’ హనుమాన్ చిత్రానికి ప్రేక్షకులు అందించిన అపారమైన ఆదరణకు ప్రతిగా మేమేం చేయగలమని ఆలోచించి, త్రీడీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. అత్యాధునిక టెక్నాలజీతో ఈ వెర్షన్‌ను మీ ముందుకు తీసుకొస్తు న్నాం. ఈరోజు ట్రైలర్‌లో స్వామి వారిని త్రీడీలో చూసిన తర్వాత ఆయన ఆశీస్సులు మాపై ఉన్నా యనే భావన కలిగింది. హనుమం తుడు స్వయంగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లు అనిపించింది. ఈ త్రీడీ హనుమాన్ మిమ్మల్ని అలరిస్తుంది` అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -