హీరోలు వెంకటేష్, కళ్యాణ్ రామ్, దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో ఓ సినిమా రూపొంద నున్న విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గార పాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. వెంకటేష్, కళ్యాణ్ రామ్ సరసన కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయి కలుగా నటిస్తున్నారు. ఇటీవలే ఘనంగా జరిగిన పూజా కార్య క్రమంతో ఈ ప్రాజెక్ట్ లాంఛనంగా ప్రారంభమైంది.
తాజాగా, హైదరాబాద్‌లో నేటి (సోమవారం) నుంచే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయాన్ని ఒక ఫన్ వీడియో ద్వారా వెల్లడించారు. వీడియోలో అభిమానులు తనకు ఖడ్గం బహూకరించారంటూ అనిల్ చెబుతారు. వెంకటేష్ ఆ ఖడ్గంతో అనిల్ రావిపూడి బొటనవేలికి చిన్న గాటు పెట్టి ఆయనకు ‘వీర తిలకం’ దిద్దుతారు. అనంతరం కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి, సంగీత దర్శకుడు జీ.వి. ప్రకాష్ కుమార్ కూడా అదే విధంగా చేస్తారు. సరదాగా సాగిన ఈ వీడియో రెగ్యులర్ షూటింగ్ విశేషాన్ని తెలియజేసింది.
రెగ్యులర్ షూటింగ్ మొదలైంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



