Friday, February 20, 2026
E-PAPER
Homeజాతీయంతేనెటీగల దాడిలో ఓ క్రికెట్ అంపైర్ మృతి

తేనెటీగల దాడిలో ఓ క్రికెట్ అంపైర్ మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తేనెటీగల దాడిలో ఓ క్రికెట్ అంపైర్ మృతి చెందాడు. ఈ దుర్ఘ‌ట‌న‌ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఉన్నావోలో జ‌రిగింది. స్థానికంగా ఉన్న స‌పూర్ క్రికెట్ స్టేయ‌డింలో మ్యాచ్ జ‌రుగుతుండ‌గా ఒక్క‌సారిగా కందిరీగ‌లు దాడి చేశాయి. దీంతో స్టేడియంలో ఉన్న ఆట‌గాళ్లంతా ప‌రుగులు తీశారు. అయితే అంఫైర్ మాణిక్ గుప్తా ర‌న్ చేసే క్ర‌మంలో అదుపు త‌ప్పి కింద‌ప‌డిపోవ‌డంతో ఒక్క‌సారిగా ఆయ‌న‌ను కందీరీగ‌(తేనెటీగ)లు చుట్టుముట్టి తీవ్రంగా దాడి చేశాయి. దీంతో అంపైర్ మాణిక్ గుప్తా ప్రాణాలు కోల్పోయారు. గుప్తా 30 ఏండ్లుగా అంఫైర్‌గా విధులు నిర్వ‌హిస్తున్నార‌ని, ఆయ‌న మృతి ఎంతో బాధిస్తుంద‌ని తొటి ఉద్యోగులు క‌న్నీరుమున్నీరు అవుతున్నారు.

‘‘మాణిక్ గుప్తా తన జీవితాంతం అంపైరింగ్ చేయడానికి తన కుటుంబాన్ని పోషించడానికి అంకితం చేశాడని అన్నారు. ఆయన క్రికెట్‌కు పూర్తిగా అంకితభావంతో ఉన్నారని, ఈ సంఘటన దురదృష్టకరమని, ఆయన ఒక విశిష్ట అంపైర్, కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడని’’ తొటి అంపైర్ భర్తేందు పూరి పేర్కొన్నారు.

“డ్రింక్స్ బ్రేక్ సమయంలో తేనెటీగల గుంపు మాపై దాడి చేసింది. మేము పరిగెత్తాము, కానీ మాణిక్ భాయ్ పెద్దవాడు కాబట్టి, అతను తేనెటీగల నుండి పారిపోలేకపోయాడు. అందరూ నేలపై పడుకున్నప్పుడు, తేనెటీగలు అక్కడ ఉన్న వారందరిపై దాడి చేశాయి. మాణిక్ పై తీవ్రంగా దాడి జరిగింది’’ అని మ‌రో అంపైర్ జ‌గ‌దీష్ శ‌ర్మ చెప్పారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -