Wednesday, April 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలుజస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌..తీర్పుపై ఉత్కంఠ‌

జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌..తీర్పుపై ఉత్కంఠ‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌పై దాఖలైన పిటిషన్‌లపై ఇప్పటికే వాదనలను విన్న హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించనుంది.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణల్లో అవకతవకలపై విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌పై దాఖలైన పిటిషన్‌లపై ఇప్పటికే వాదనలను విన్న హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించనుంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన నాణ్యతా లోపాలు మరియు ఆర్థిక అవకతవకలపై జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ నియమించారు.

సుమారు 15 నెలల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన జస్టిస్ ఘోష్ కమిషన్, ఇప్పటికే ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. అయితే, ఈ విచారణ ప్రక్రియ అంతా ఏకపక్షంగా సాగిందని, తమ వివరణను పరిగణనలోకి తీసుకోకుండానే నివేదిక ఇచ్చారని కేసీఆర్, హరీష్ రావు కోర్టును ఆశ్రయించారు. తమను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వం కమిషన్ వివరాలను మీడియాకు లీక్ చేస్తోందని, అందుకే ఈ కమిషన్‌ను రద్దు చేయాలని వారు తమ పిటిషన్‌లో కోరారు. మరోవైపు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ప్రజాప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని కమిషన్‌ వేసినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -