అసమానతల అంతమే అంబేద్కర్‌కిచ్చే నివాళి

అసమానతల అంతమే అంబేద్కర్‌కిచ్చే నివాళి‘కులం పునాదులపై ఒక జాతిని ఒక నీతిని నిర్మిం చలేము’ అన్నారు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌. కులాధారిత సమా జాన్ని కూలదోసి, మానవ సమాజాన్ని నిర్మించాలని ఆయన భావించారు. కానీ నేడు కులాన్ని బలపర్చడం, దాన్ని స్థిరపర్చ డం జరుగుతుంది. కులం ఓటు బ్యాంకుకు కేంద్రంగా, పాలక వర్గాలకు పావుగా మారింది. ఆయన విగ్రహాలకు పూలదండలు వేసి దండాలు పెట్టి కీర్తించడం, ఆయన ఆశయాలని మాత్రం ఆధాపాతలంలోకి తొక్కడం నేడు జరిగుతున్నది. అగ్ర కులాలు కులాన్ని తమ ఆధిపత్యం కోసం, తమకంటే కింది వారిని అణిచివేయడం తాము పై కులస్తులమని గర్వం ప్రదర్శించడానికి ఉపయోగిస్తున్నాయి. అప్పటికే అసమానతలు ఉన్న కులాల్లో కింది కులాల వారిలో సైతం తమ కులానికి అన్యాయం జరుగుతుందని పాలక వెగలతో రాజీపడుతూ అందులోని ఒక నాయకుడు ప్ర యోజనం కోసం మొత్తం తమ కులాన్ని తాకట్టు పెట్టడం చూస్తున్నాం. మనువాదం సృష్టించిన జబ్బు కులమని మనుస్మృతి గ్రంథాన్ని అంబేద్కర్‌ ఆనాడే తగులబెట్టిన విషయం తెలిసిందే. ఓ వైపు అంబేడ్కర్‌ మాకు స్ఫూర్తి అని చెబుతూ మరోవైపు అన్ని రకాల అసమానతలకు మూల మైన మనుస్మృతి వారసురాలైన బీజేపీ పంచన చేరుకున్నది చూస్తున్నాము. అంబేడ్కర్‌ కుల అసమానతలు, కులం స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయం అనే విలువలకు వ్యతిరేక మైనదనీ దానిని సమూలంగా నిర్మూలించి మానవ సమాజ మంతా ఒక్కటిగా ఉండాలన్నారు. సామాజిక ఆర్థిక న్యాయం జరగాలంటే సమాజంలో అంతరాలు అంతం కావాలని చెప్పారు.
మన రాజ్యాంగం కులవివక్ష అంటరానితనాన్ని సమూ లంగా నిర్మూలించి, కులనిర్మూలనకు బాటలు వేయాలన్నది. కానీ ఆ రాజ్యాంగంపై ప్రమాణం చేసి గద్దెనెక్కిన మనువాద బీజేపీ రాజ్యాంగ లక్ష్యాలను నాశనం చేస్తోంది. ఆరెస్సెస్‌ కను సన్నల్లో పనిచేస్తూ తమ అంతిమ లక్షమైన మనువాద రాజ్యానికి అడ్డుగా ఉందని రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేయడానికి కుట్రలు చేస్తుంది అందుకోసమే నేడు కుల, మత వైషమ్యాలను పెంచి పోషిస్తుంది. ప్రత్యేకించి బీజేపీ అధికారం లోకి వచ్చినప్పటి నుండి ఈ వైషమ్యాలు పెట్రేగి పోయాయి. బ్రాహ్మణిజం, క్యాపిటలిజం రెండూ మనదేశానికి శత్రువులని అంబేద్కర్‌ ఏనాడో చెప్పా డు. సరిగ్గా ఆయన లక్ష్య విరోధులే ఈ దేశాన్ని ఏలడం ఈ దేశ ప్రజల దౌర్భాగ్యం. 1950 జనవరి 26నుండి అమల్లోకి వచ్చిన కేవలం ఒక శాసన గ్రంథం మాత్రమే కాదు, అది ఒక సోషల్‌ రెవ ల్యూషనరీ డాక్యుమెంటు. స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాత్రృత్వం, సామాజిక న్యాయం వంటి అనేక విలువలను ఈ ఆధునిక సమాజంలో వ్యవస్థీక రించే ఆశయాన్ని అందులో ప్రకటించారు. భూమి సమాన త్వాన్ని పరిశ్రమల్లో కార్మికులకు యాజమాన్య వాటా స్త్రీ సమానత్వం కోసం ఆయన పేర్కొన్న అంశాలు ఏనాటికైనా విప్ల వకరమైనవే. మానవ సమాజం ఒక సమానత్వ సమాజంగా రూపుదిద్దుకొని ఒక పవిత్ర విలువగా నిర్మించటమే దానికి గల విప్లవకర స్వభావం అన్నారు.
1917 రష్యాలో లెనిన్‌ నాయకత్వంలో ఏర్పడిన సోషలిస్ట్‌ విప్లవ ప్రభావం నాడు ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. ఆ వెలుగులో అంబేడ్కర్‌, లెనిన్‌, మా ర్టిన్‌ లూథర్‌ కింగ్‌, జోతి భాపూలే వంటి ఆధునిక తాత్వికుల నుంచీ, ఆధునిక కాల విప్లవ మహోపాధ్యాయుల నుంచీ రెవ ల్యూషనరీ అంబేద్కర్‌ స్వీకరిం చారు. అంబేడ్కర్‌ విద్య, వైద్యం ఎల్లవేళలా సంక్షేమ రంగంలో మాత్రమే ఉండాలని చెప్పారు. పాలకులు మాత్రం విద్య వైద్యాన్ని ప్రయివేటు కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టారు. దీంతో సామాన్య పేద విద్యా ర్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. నిరుపేదలకు సరైన వైద్య మందడం లేదు. అంబేద్కర్‌ పరిశ్ర మలలో కార్మికులకు యాజమాన్య వాటా ఉండాలని చెబితే నేడు కార్మికులకు కనీస వేతనం కూడా ఇవ్వని దుస్థితి. కార్మికులు కనీస వేతనం పిఎఫ్‌, ఈఎస్‌ఐ, పెన్షన్‌, ఉద్యోగ భద్ర త కోసం చేస్తున్న సార్వత్రిక సమ్మెలు చూస్తున్నాం. అయన స్త్రీ సమాన త్వం కోసం హిందూ కోడ్‌బిల్‌ పె డితే అది ఆమోదం కాకపోవడం తో ఆయన రాజీనామా చేశారు. నేడు మహిళలంటే ద్వితీయ శ్రేణి పౌరులుగా గుర్తించే పార్టీ అధికా రంలో ఉండడం వల్ల మహి ళలపై హింస పెరిగింది. తెలంగాణ ఎన్నిక ల్లో బీసీ సీఎం అని ప్రకటించారు ఆ యనే ఓబీసీ పీఎంగా ఉండి ఓబీసీలకు చేసిందేమీ లేదు. బీసీ కులగణన చేపట్టబో మని సుప్రీంకోర్టుకు సైతం వెళ్లిన ఘనత బీజేపీదే. రాష్ట్రంలోవారి పార్టీ బీసీ అధ్యక్షుడిని తొలగించిన తెలిసిందే. 56శాతం ఉన్న బీసీలకు బడ్జెట్‌లో కేవలం నాలుగు శాతం నిధు లు కేటాయించడం ఇవ్వన్నీ బీజేపీ బీసీలను మోసగించినవి కావా? ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ గురించి తొమ్మిదేండ్లుగా కనీస అపాయింట్‌ మెంట్‌ ఇవ్వని మోడీ నేరుగా ఎమ్మార్పీఎస్‌ సభలో పాల్గొనడం మోసం కాకపోతే ఇంకేమిటి? గొర్రె కసాయి వాడిని నమ్మినట్లుగానే మందకృష్ణ మోడీని నమ్మడం తద్వారా ఎస్సీలను బీజేపీ ఓటు బ్యాంక్‌గా మార్చడం కోస మేనని స్పష్టమవుతోంది.
కుల నిర్మూలన పోరాటం శాంతియుతంగా జరగాలనే కోరుకున్నాం. కానీ హింసను ఒక సాధనంగా మనువాద పాల కవర్గం ఉపయోగిస్తూ ఈ పోరాటాలను అణచివేస్తున్నది. కులాంతర వివాహాలు చేసుకున్నవారికి రక్షణ లేదు. గత డెబ్బ యేండ్లలో వేలాదిమందిని హత్య గావించబడ్డారు. ఈ మధ్యకా లంలో జరిగిన కులదురహంకార హత్యలను మనం ఇంకా మరి చిపోలేదు. పెరుమాండ్ల ప్రణరు, మంథని మధుకర్‌, అంబోజి నరేష్‌ హత్యలు అందుకు ఒక ఉదాహరణ. ఇంకా చెప్పాలంటే కులం, భూమి రెండూ విడదీయరాని అంశాలు. ప్రజలు భూమ్మీద హక్కుల కోసం భూస్వాముల సొంత సాయుధ ముఠాలతో పోరాడడంతో వాళ్ల మీద హింసకాండ సాగింది. ఎన్నుకోబడిన పాలకవర్గాలే వెన్నుదన్నుతో భూస్వాములను ప్రోత్సహించడం శోచనీయం. కూలీ రేట్లు పెంచమని అడిగి నందుకు తమిళనాడులోని కీళవేణ్మనిలో సామూహిక హత్యా కాండ, మహారాష్ట్రలో ఖైర్లాంజీ ఊచకోత, ఆంధ్రలో కారంచేడు, చుండూరు, వేంపెంట, పదిరి కుప్పం, లక్షింపేట, జరిగిన హత్యలు అందుకు సాక్ష్యం. సైద్ధాంతికంగా కుల, మత ఫాసి జాలను వ్యతిరేకిస్తూ పోరాడిన వారిని హత మార్చడం కూడా అందులో భాగమే. కల్బుర్గి, దబోల్కర్‌, గౌరీ లంకేష్‌, రోహిత్‌ వేముల వంటి అనేక మందిని పొట్టనెట్టుకున్న సంగతి మరువలేం. ఈ అసమానతల అంతం కోసం సాగే పోరాటంలో అనేక మంది అసువులు బాసారు.
అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగ రద్దుకు బీజేపీ అనేక రకాల కుట్రలు చేస్తోంది. మనుస్మృతిని మన రాజ్యాంగంగా ప్రవేశపెట్టి, దేశాన్ని మత రాజ్యాంగ మార్చాలని భావిస్తోంది. దీనిని అడ్డు కొని రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. అంబేడ్కర్‌ ఆశయాలను నిల బెట్టడడం, రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను రక్షించుకోవడం, ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ ఉద్యమం మహోన్నతంగా సాగాలి. అదే మనం అంబేద్కర్‌కు అర్పించే నివాళి.
(నేడు అంబేడ్కర్‌ 67వ వర్ధంతి)
సెల్‌ : 9177549646
టి.స్కైలాబ్‌ బాబు

Spread the love