Monday, June 22, 2026
E-PAPER
- Advertisement -

ఖతార్‌ రస్‌లఫాన్‌లో భారీ పేలుడు

నవతెలంగాణ – హైదరాబాద్ : ఖతార్‌లోని రస్‌లఫాన్‌లో ఎక్స్‌పోర్టు టెర్మినల్‌లో ఆదివారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 54 మంది తీవ్రంగా గాయపడగా, 18 మంది ఆచూకీ లభించడం లేదు. రస్‌లఫాన్‌లోని ఈ చమురుక్షేత్రం నుంచే భారత్‌కు ముడిచమురు సరఫరా అవుతోంది. ఇటీవల జరిగిన అమెరికా-ఇరాన్‌ యుద్ధంలో తీవ్రంగా దెబ్బతిన్న ఈ టెర్మినల్‌ వద్ద  ప్రమాదం సంభవించడం గమనార్హం. హర్మూజ్‌ తెరుచుకొన్నాక.. కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తున్న వేళ ఈ ప్రమాదం జరగడం ఖతార్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -