- Advertisement -
ఖతార్ రస్‌లఫాన్‌లో భారీ పేలుడు
నవతెలంగాణ – హైదరాబాద్ : ఖతార్‌లోని రస్‌లఫాన్‌లో ఎక్స్‌పోర్టు టెర్మినల్‌లో ఆదివారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 54 మంది తీవ్రంగా గాయపడగా, 18 మంది ఆచూకీ లభించడం లేదు. రస్‌లఫాన్‌లోని ఈ చమురుక్షేత్రం నుంచే భారత్‌కు ముడిచమురు సరఫరా అవుతోంది. ఇటీవల జరిగిన అమెరికా-ఇరాన్ యుద్ధంలో తీవ్రంగా దెబ్బతిన్న ఈ టెర్మినల్ వద్ద ప్రమాదం సంభవించడం గమనార్హం. హర్మూజ్ తెరుచుకొన్నాక.. కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తున్న వేళ ఈ ప్రమాదం జరగడం ఖతార్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
- Advertisement -



