Monday, June 22, 2026
E-PAPER
Homeఖమ్మంకొబ్బరి బోండాల కత్తులతో దాడి..ఇద్దరికి తీవ్రగాయాలు

కొబ్బరి బోండాల కత్తులతో దాడి..ఇద్దరికి తీవ్రగాయాలు

- Advertisement -

నవతెలంగాణ – సత్తుపల్లి: సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామ శివారులో ఆదివారం అర్ధరాత్రి తీవ్ర కలకలం రేగింది. గ్రామానికి దూరంగా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారని నిలదీసిన ఇద్దరు వ్యక్తులపై సదరు దంపతులు కొబ్బరి బోండాలు నరికే కత్తులతో అత్యంత కిరాతకంగా దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు, బాధితుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరువూరు మండలానికి చెందిన నాగమణి, హనుమంతరావు దంపతులు సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామ సమీపంలో నివాసం ఉంటున్నారు.

అయితే, వీరు అక్కడ రహస్యంగా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. దీనివల్ల తమ గ్రామానికి చెడ్డపేరు వస్తోందని భావించిన కిష్టారం ఎస్సీ కాలనీకి చెందిన మారోజు నాగేశ్వరరావు, నక్కా వెంకటేశ్వరరావు అనే ఇద్దరు వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి ఆ దంపతుల వద్దకు వెళ్లారు. గ్రామ సమీపంలో ఇలాంటి పనులు చేయడం మంచి పద్ధతి కాదు, ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోండని వారిని హెచ్చరించారు. ​ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన నాగమణి, హనుమంతరావు దంపతులు ఇంట్లో ఉన్న కొబ్బరి బోండాలు నరికే పెద్ద కత్తులను తీసుకొచ్చి, నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావులపై విచక్షణారహితంగా దాడి చేశారు.

దాడిలో వారిద్దరికీ తీవ్రంగా గాయపడ్డారు. ​స్థానికులు వెంటనే 108 అత్యవసర వాహనానికి సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన బాధితులిద్దరినీ చికిత్స నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ​​ఘటన జరిగిన వెంటనే నిందితులైన భార్యాభర్తలిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. అయితే, ఆ వ్యభిచార గృహంలో ఉన్న కొత్తగూడెంకు చెందిన సోనీ అనే యువతి పోలీసులకు పట్టుబడింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -