Monday, June 22, 2026
E-PAPER
Homeజాతీయంమహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షాల ఆందోళన

మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షాల ఆందోళన

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: తొలి రోజు మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు ఆందోళన బాటపట్టాయి. ఫడ్నవీస్ ప్రభుత్వం, రైతుల 7/12 భూమి రికార్డులను సరి చేయాలని శివసేన (UBT) ఎమ్మెల్యే ఆదిత్య థాకరే, కాంగ్రెస్ నాయకుడు విజయ్ వడెట్టివార్ ఇతర నాయకులు మరాఠీలో నినాదాలు చేశారు. జూన్ 2న, మహారాష్ట్ర మంత్రివర్గం ‘పుణ్యశ్లోక్ అహల్యాదేవి హోల్కర్ రైతు రుణ విముక్తి పథకం’కు ఆమోదం తెలిపిందని, కానీ ప్రస్తుతం రూ. 2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేయకుండా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. బ్యానర్ చేతబూని అసెంబ్లీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -