Monday, June 22, 2026
E-PAPER
Homeజాతీయంరాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై ఆయన చర్చించారు. ముఖ్యంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖకు చెందిన భూములను బదిలీ చేసినందుకు కేంద్ర మంత్రికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు అభివృద్ధి అంశాన్ని కూడా ఈ సమావేశంలో ఆయన ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ, యుటిలిటీల బదిలీ తదితర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. దేశ రక్షణ, సమగ్రతకు సంబంధించిన అంశం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర మంత్రికి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -