నవతెలంగాణ-హైదరాబాద్: రష్యా రాజధాని మాస్కోను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ మరోసారి డ్రోన్లతో దాడులు చేసింది. ఉక్రెయిన్‌కు చెందిన డ్రోన్లు మాస్కో వైపు దూసుకొస్తుండగా, రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. దాదాపు 60 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా అధికారులు వెల్లడించారు. ఈ పరిణామంతో మాస్కోలోని నాలుగు ప్రధాన విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు (Moscow drone attack). ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రాణనష్టం లేదా భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు నివేదికలు లేవని అన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా షెరెమెత్యేవో, డొమోడెడోవో, వ్నుకోవో, జుకోవ్‌స్కీ విమానాశ్రయాల్లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత విమాన సర్వీసులను పునరుద్ధరించారు (Moscow airports closed).
మరోసారి మాస్కోపై డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి
- Advertisement -
- Advertisement -



